తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి - corona news

తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా కరోనా వైద్యాన్ని అందించాలని పేర్కొన్నారు.

MLC JEEVAN REDDY CRITICIZED TS GOVERNMENT
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

By

Published : Aug 19, 2020, 5:49 PM IST

కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనా విషయంలో పలుమార్లు న్యాయస్థానం చురకలు అంటించిందన్నారు. రోజుకు 40వేలు పరీక్షలు చేస్తామని న్యాయస్థానానికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కూడా పరీక్షలు చేయడం లేదని ఆరోపించారు.

ప్రైవేటు ఆస్పత్రులపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల హెచ్చరికలు తాటాకు చప్పుళ్లకు పరిమితమయ్యాయని, ఏలాంటి ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా కరోనా వైద్యాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

ABOUT THE AUTHOR

...view details