తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ రెండు అంశాల్లో కేసీఆర్ ప్రగతి సాధించారు: జీవన్​రెడ్డి - ప్రభుత్వంపై మండిపడ్డ జీవన్ రెడ్డి

రెండు అంశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతిలో పయనించేలా చేశారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి. ఆరున్నరేళ్ల తెరాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలను నిందించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

Mlc jeevan reddy counters on state government
'ఆ రెండు అంశాల్లో కేసీఆర్ ప్రగతి సాధించారు'

By

Published : Mar 17, 2020, 1:47 PM IST

బడ్జెట్​ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేసే ధోరణి ప్రదర్శించిందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మండిపడ్డారు. ఆరున్నరేళ్ల తెరాస పాలనలో సర్కారు రెండు అంశాల్లో ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చడంలో కేసీఆర్ విజయం సాధించారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ప్రగతి సాధించారని దుయ్యబట్టారు.

'ఆ రెండు అంశాల్లో కేసీఆర్ ప్రగతి సాధించారు'

ABOUT THE AUTHOR

...view details