శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఉప ఛైర్మన్ నేతి విద్యాసాగర్ తన కార్యాలయంలో గుత్తాతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుత్తా సుఖేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు.
ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం - Gutha
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఉప ఛైర్మన్ నేతి విద్యాసాగర్ గుత్తాతో ప్రమాణం చేయించారు.

MLC
ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం
Last Updated : Aug 26, 2019, 1:46 PM IST