పేదరికం ప్రతిభకు అడ్డంకం కాదని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ అన్నారు. నీట్‌లో ఉత్తమ ర్యాంకు పొంది ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన విద్యార్థినికి సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు.
నీట్ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం - హైదరాబాద్ తాజా వార్తలు
నీట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్‌లో సీటు పొందిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తెకు సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ ఆర్థికసాయం చేశారు. రూ. 52వేల రూపాయల చెక్కును విద్యార్థినికి అందజేశారు.

నీట్ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం
హైదరాబాద్ చాదర్‌ఘాట్ మురికి వాడకు చెందిన ఆటో డ్రైవర్ మక్బూల్ కుమార్తె హీనా మొహమ్మది బేగం ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. తన ప్రతిభతో షాదన్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది. విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ సిద్దిపేట ఫౌండేషన్ సభ్యులతో కలిసి విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను సన్మానించి రూ.52వేలు చెక్కు అందించారు. ఆమె చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారు.