తెలంగాణ

telangana

ETV Bharat / state

మే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు - Mlc elections news

శాసనమండలిలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు జూన్‌లో ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యేల ద్వారా ఎంపికైన ఆరుగురు ఎమ్మెల్సీలు, గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఎంపికైన మరో ఎమ్మెల్సీ పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మరో స్థానాన్ని జూన్‌లో భర్తీ చేయనున్నారు.

MLC elections in May
ఎమ్మెల్సీ ఎన్నికలు

By

Published : Apr 4, 2021, 6:48 AM IST

శాసనమండలిలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు జూన్‌లో ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యేల ద్వారా ఎంపికైన ఆరుగురు ఎమ్మెల్సీలు, గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఎంపికైన మరో ఎమ్మెల్సీ పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మరో స్థానాన్ని జూన్‌లో భర్తీ చేస్తారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి, చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, సభ్యులు ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌లు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక కాగా వారి పదవీ కాలం జూన్‌ 3తో ముగుస్తుంది.

గవర్నర్‌ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీ, తెరాస కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం జూన్‌ 16 వరకు ఉంది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు వచ్చే నెల 2న జరగనుంది. ఆ తర్వాతే ఆరు స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఆ తర్వాత 3 వారాల పరిధిలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. గవర్నర్‌ కోటా స్థానం ఖాళీకి ముందే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

పెద్దఎత్తున పోటీ...

దీర్ఘకాలం తర్వాత ఒకేసారి ఏడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతుండగా... వీటికి పెద్దఎత్తున పోటీ ఏర్పడింది. ప్రస్తుత సభ్యులకు తోడు కొత్తగా ఆశావహులు భారీ సంఖ్యలో ఉన్నారు. తెరాస బలం దృష్ట్యా ఏడు స్థానాలను నిలబెట్టుకుంటుంది. గత లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి తాజాగా జరుగుతున్న నాగార్జునసాగర్‌ ఎన్నికల వరకు ఆయా నేతల పనితీరు, విధేయత, విజ్ఞత, వివిధ ఎన్నికల్లో వ్యవహరించిన వైఖరి, సామర్థ్యం, సామాజిక నేపథ్యం, పార్టీ అవసరాలు, అంచనాల ఆధారంగా సీఎం జాబితాను సిద్ధం చేస్తారని తెలుస్తోంది. గుత్తాకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయంగా కనిపిస్తోంది.

ఎమ్మెల్సీగా రెండేళ్ల కాలం మాత్రమే పూర్తి చేసుకుంటున్నందున ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. మండలి ఛైర్మన్‌గానూ ఆయనను కొనసాగించే వీలుంది. చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు పేరును సీఎం పరిగణనలోనికి తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. మిగతా సభ్యుల్లో మళ్లీ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. ఎవరినైనా ఎంపిక చేయలేని పరిస్థితి వస్తే వారి సామాజికవర్గాలకు చెందిన వారికే అవకాశమిస్తారని భావిస్తున్నారు.

ఇవీచూడండి:బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!

ABOUT THE AUTHOR

...view details