తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపే మండలి ఎన్నికలు - assembly

రేపు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, ఎంఐఎం అభ్యర్థులను గెలిపించుకోవాలని శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గందరగోళం తలెత్తకుండా నమూనా పోలింగ్ నిర్వహించారు.

అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​

By

Published : Mar 11, 2019, 11:49 PM IST

అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​
శాసనమండలి ఎన్నికల్లో తెరాస, ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. గులాబీ పార్టీ అభ్యర్థులు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ అఫండిని ఎమ్మెల్యేలకు సీఎం పరిచయం చేశారు. ఒక్కో అభ్యర్థికి ఇరవై మంది... మరో అభ్యర్థికి 19మంది ఓట్లు వేయటంతో పాటు ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటేయాలో వివరించారు. గందరగోళం తలెత్తకుండా.. చెల్లని ఓట్ల సమస్య రాకుండా ఉండేందుకు... నమూనా పోలింగ్ నిర్వహించారు. రేపు ఉదయం ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్​కు చేరుకోనున్నారు.ఒక్కో అభ్యర్థికి ఓటేయాల్సిన 20మంది ఒక్కో బస్సులో అసెంబ్లీకి బయలు దేరుతారు. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఎవరికి కేటాయించిన ఓటు వారు వేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details