శాసనమండలి ప్రొటెం ఛైర్మన్(Protem Chairman)గా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి (Mlc Bhupal reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ సభ్యత్వాల గడువు నిన్నటితో ముగిసింది. ఇద్దరు ప్రిసైడింగ్ అధికారుల పదవీకాలం ముగియడంతో ఆ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో సీనియర్ సభ్యుడైన భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు.
Protem Chairman: నేడు ప్రొటెం ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ - Telangana mandali Protem Chairman news
శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా (Protem Chairman) ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి (Mlc Bhupal reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరిగే వరకు భూపాల్ రెడ్డి ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు.
ప్రొటెం ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి
2007లో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఇప్పటికి మూడు పర్యాయాలు పెద్దలసభకు ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రొటెం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ హోదాలో మండలి ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తారు. తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరిగే వరకు భూపాల్ రెడ్డి ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల్లో ఉంటారు.
ఇదీ చూడండి: మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన