తెలంగాణ

telangana

ETV Bharat / state

'రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తా' - హైదరాబాద్​ తాజా వార్తలు

రజకులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే అన్ని రజక సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని ఎమ్మెల్సీ బస్వరాజ్​ సారయ్య అన్నారు. హిమాయత్​నగర్​లోని బీసీ సాధికారత భవన్​లో రజక సంఘాల నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.

mlc basavaraju saraiah told do part to get the rajaks included in the SC list
'రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తా'

By

Published : Feb 21, 2021, 4:42 PM IST

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. హిమాయత్​నగర్​లోని బీసీ సాధికారత భవన్​లో రజక సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్​లో ఎక్కువ నిధులు కేటాయించేందుకు పాటుపడతానని హామీ ఇచ్చారు.

రజకులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే అన్ని రజక సంఘాల నాయకులు ఏకతాటిపైకి రావాలని బస్వరాజ్​ సారయ్య అన్నారు. వెనుకబడిన కులాల ప్రతినిధిగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. రజకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని మొదటిస్థానంలో నిలపాలి'

ABOUT THE AUTHOR

...view details