MLAs Wishes to CM KCR at Assembly Sessions : రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు వెల్లువెత్తాయి. శాసనసభ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను ఛాంబర్‌లో కలిసి... రైతు, ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్‌లో తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, బుధవారం తీసుకున్న రుణమాఫీ నిర్ణయానికి కృతజ్జతాభివందనాలు తెలిపారు. దాంతో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సందడి నెలకొంది.
Ministers Wishes to CM KCR : రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుసీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చాలు అందించారు. తమ రైతుల తరఫున ప్రజల పక్షాన సీఎం ధన్యవాదాలు తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు హైద్రాబాద్లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ నిర్ణయం, తదితర అభివృద్ది సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్జతాభినందనలు వెల్లువెత్తాయి. రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎంకు పూలబొకే అందించారు. రైతు కుటుంబాలన్నీ సంబరాలు జరుపుకుంటున్నాయని వివరించారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని.. రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ మరోసారి నిలిచారని కొనియాడారు. ఆయా జిల్లాల మంత్రుల ఆధ్యర్యంలో ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.