పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, హరి ప్రియ నాయక్, జాజాల సురేందర్, కందాల ఉపేందర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉదయం భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలు కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని పోచారం నివాసానికి వెళ్లి కలిశారు.
ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయండి: భట్టి విక్రమార్క
పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గండ్ర వెంకటరమణా రెడ్డి మినహా పార్టీ ఫిరాయించిన వారందరిపై వేటు వేయాలని స్పీకర్‌ను భట్టి కోరారు.
ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయండి: భట్టి విక్రమార్క
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అంబేడ్కర్ జయంతి రోజున స్పీకర్‌ను కలిసి పిటిషన్ అందచేశారు. పార్టీ మారుతున్నట్లు నిన్న రాత్రి ప్రకటన చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మినహా మిగిలిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. సీఎల్పీని తెరాసలో విలీనం చేసే నిర్ణయం ఏదైనా తీసుకునేటట్లయితే అంతకంటే ముందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
Last Updated : Apr 23, 2019, 4:46 PM IST