ఓటుకు నోటు కేసులో అనిశా న్యాయస్థానం కొట్టివేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా నిర్ణయించారు. హైకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని.. అప్పటి వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టవద్దని సండ్ర, ఉదయ్ సింహా తరఫు న్యాయవాదులు ఇవాళ అనిశా న్యాయస్థానాన్ని కోరారు. అంగీకరించిన అనిశా న్యాయస్థానం ఓటుకు నోటు కేసు విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసు: హైకోర్టును ఆశ్రయించనున్న సండ్ర, ఉదయ్ - vote for note case
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. హైకోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని.. అప్పటి వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టవద్దని అనిశా న్యాయస్థానాన్ని కోరారు.
![ఓటుకు నోటు కేసు: హైకోర్టును ఆశ్రయించనున్న సండ్ర, ఉదయ్ MLAs Sandra Venkata Virayya and Uday Sinha have decided to approach the High Court on the discharge petitions dismissed by the acb court.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9431419-84-9431419-1604496498714.jpg)
ఓటుకు నోటు కేసు: హైకోర్టును ఆశ్రయించనున్న సండ్ర, ఉదయ్
ఓఎంసీ అక్రమాలపై సీబీఐ కేసులో బెయిల్ కోసం గాలి జనార్దన్ రెడ్డి ముడుపులు ఇచ్చారన్న అభియోగంపై దాఖలైన ఛార్జ్ షీట్లలో అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో సాక్షుల విచారణ కొనసాగుతోంది. విచారణ రేపటికి వాయిదా పడింది.