MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖకు ఈరోజు సిట్ విచారణ ముగిసింది. చిత్రలేఖను 8 గంటలపాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆమె వాంగ్మూల్మాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు.మరోవైపు ఈ కేసులోని ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టును ఆశ్రయించిన తుషార్: ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పిగించాలంటూ కేరళకు చెందిన బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ కూడా హైకోర్టును ఆశ్రయంచారు. సిట్ ఏర్పాటును సవాల్ చేసిన తుషార్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సొమ్ము దొరకలేదన్న తుషార్.. మొయినాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని నాంపల్లి కోర్టుకు ఎఫ్ఐఆర్ పంపేందుకు 18 గంటలు పట్టిందని పిటిషన్‌లో అనుమానం వ్యక్తంచేశారు.
తన మెయిల్‌ను పరిగణనలోకి తీసుకోలేదు:ఫాంహౌజ్‌లో పెట్టిన రహస్యకెమెరాల ఫుటేజీ సీడీని పోలీసులు సీఎం కేసీఆర్‌కి ఇవ్వగా.. వాటిని దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల పంపించారని తుషార్ పేర్కొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంపెట్టి తన ఫోటో చూపించి ఎమ్మెల్యేలకు ఎరవేసిన ఏజెంటుగా ఆరోపించారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈనెల 21న విచారణకు హాజరు కావాలని 16న సిట్ 41ఏ నోటీసులు ఇచ్చిందని.. అనారోగ్యం కారణంగా రెండు వారాల గడువు కోరినట్లు వివరించారు. తన మెయిల్‌ను పరిగణనలోకి తీసుకోకుండానే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.