డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యానాయక్ తన ఇంటి ముందున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చేసి, స్థలాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నాడని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చిన్నగూడూరు మండలం మంచ్య తండాలో నివాసముండే రెడ్యానాయక్ తన ఇంటి ముందున్న ప్రభుత్వ పాఠశాలను కూల్చేశాడని అదే గ్రామానికి చెందిన వెంకన్న నాయక్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఎమ్మెల్యే సొంత అవసరాలకు.. ప్రభుత్వ పాఠశాలను కూల్చేశారు! - Demolish the public school building in front of the house and use the space for own purposes
వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ పాఠశాలను కూల్చివేశారని ఆరోపిస్తూ.. డోర్నకల్ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఎమ్మెల్యే సొంత అవసరాలకు.. ప్రభుత్వ పాఠశాలను కూల్చేశారు!
పదిహేనేళ్ల క్రితం ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కూడా కబ్జా చేశాడని వెంకన్న నాయక్ పిటిషన్లో పేర్కొన్నాడు. విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశిస్తూ ఫిభ్రవరి 5 వరకు విచారణ వాయిదా వేసింది.
ఎమ్మెల్యే సొంత అవసరాలకు.. ప్రభుత్వ పాఠశాలను కూల్చేశారు!
ఇదీ చూడండి : స్పీకర్ బాక్స్ పేలిన ఘటనలో ఏడేళ్ల బాలుడి చేతి వేళ్లు తునాతునకలు...
Last Updated : Jan 6, 2020, 11:19 PM IST