తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA Tickets Clash in BRS : బీఆర్​ఎస్​ కారులో కుదుపులు.. నేతల మధ్య ముదిరిన విభేదాలు..! - MLA Tickets Clash in BRS

MLA Tickets Clash in BRS : అధికార బీఆర్​ఎస్​లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావాహుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. మరోసారి తమకే టికెట్‌ ఇవ్వాలంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు.. మాకు అవకాశం ఇవ్వాలంటూ ఆశావహులు పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగానే అనుకూల, వ్యతిరేక వర్గీయుల ఆందోళనలతో నియోజకవర్గాల్లో రాజకీయ వేడి రాజుకుంది.

BRS MLA Candidates First List
MLA Tickets Clash in BRS

By

Published : Aug 20, 2023, 10:22 PM IST

MLA Tickets Clash in BRS : బీఆర్​ఎస్​లో రచ్చకెక్కిన విభేదాలు

BRS MLA Candidates First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Legislative Election 2023) పోటీచేసే అభ్యర్థుల ఖరారుపై బీఆర్​ఎస్​ కసరత్తు జోరుగా సాగుతున్న వేళ అసమ్మతి స్వరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి తమకే అవకాశం కల్పించాలంటూ ప్రయత్నలు ముమ్మరం చేస్తే మరోవైపు వ్యతిరేక వర్గీయులు పోరాటం కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ మద్దతుదారులతో మంత్రి హరీశ్‌రావును కలిశారు. హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దని పలువురు నేతలు నిన్న సమావేశం కావడంతో ఆమె హరీశ్‌ను కలిసి తమ అభిప్రాయాన్ని తెలిపారు.

Class War Between BRS Leaders :టికెట్‌ కోసం ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ (GHMC) మాజీ మేయర్‌ బొంతు రామోహన్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఇద్దరిలో ఒకరికి ఉప్పల్ టికెట్ ఇవ్వాలని కోరారు. ఉప్పల్ టికెట్ లక్ష్మారెడ్డికి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో వీరు కవితను కలిశారు. సిరికొండ మధుసూదనాచారికి (Sirikonda Madhusudanachari) ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు భూపాలపల్లిలో సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు మధుసూదనాచారికి అన్యాయం చేసే కుట్రలు చేస్తున్నారని గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మెదక్ ఎమ్మెల్యే సీటు మైనంపల్లి రోహిత్‌కు ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు ధర్నా చేపట్టారు. పద్మా దేవేందర్ రెడ్డికి సీటు ఇవ్వొద్దని నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ(ZPTC) అనిల్ జాదవ్‌కి టికెట్ ఖరారు కానుందనే ప్రచార నేపథ్యంలో.. ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీఆర్​ఎస్​లో తిరిగి చేరిన తెల్లం వెంకట్రావుపై పలువురు భద్రాచలం నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన వారు బుచ్చయ్యకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

సిద్ధమైన అభ్యర్థుల లిస్టు : మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేస్తారని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మొదటి జాబితాలో 87 మంది పేర్లు ఉండొచ్చునని తొలుత భావించినా.. ఒకేసారి 100కు పైగా పేర్లను వెల్లడించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2022) 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన కేసీఆర్.. ఈసారి అదే సెంటిమెంట్‌ను అనుసరించవచ్చునని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

MLA Muthireddy Yadagiri Reddy Fires on Palla : 'పల్లా రాజేశ్వర్​రెడ్డి కార్పొరేట్ పద్ధతిలో కుట్రలు చేస్తూ.. నా బిడ్డను, అల్లుడిని చెడగొట్టారు'

BRS Political War in Jangaon District : జనగామలో రోడ్డెక్కిన బీఆర్​ఎస్​ రాజకీయం.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల తంటా

Telangana Leaders party Jumping : టికెట్​ కోసం గోడ దూకేందుకు సై.. తెలంగాణలో జంపింగ్‌ జిలానీల సీజన్‌ స్టార్ట్​

ABOUT THE AUTHOR

...view details