హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లోని ప్రభాత్ నగర్, సాయి నగర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్ సెంటర్లను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. వీటిని 30 లక్షల వ్యయంతో సీనియర్ సిటిజన్ల కోసం నిర్మించామని ఆయన తెలిపారు.
చైతన్యపురిలో సీనియర్ సిటిజన్ల కోసం ఓపెన్ జిమ్‌లు - రంగారెడ్డి జిల్లా తాజా వార్త
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. చైతన్యపురి డివిజన్లోని పలు కాలనీల్లో సీనియర్ సిటిజన్ల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు.
చైతన్యపురిలో సీనియర్ సిటిజన్ల కోసం ఓపెన్ జిమ్‌లు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభించామని, త్వరలోనే సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్