రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం రంగం పుంజుకుంటుందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్లో స్థిరాస్తి వ్యాపార సంస్థ గూగీ ప్రాపర్టీస్ కార్యాలయాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సంస్థ ఇప్పటికే కొత్తపేట్, బాలాపూర్, ఉప్పల్‌లో కార్యాలయాలున్నాయి. ఈ మధ్యకాలంలో నగర శివార్లలో రియల్ఎస్టేట్ ఊపందుకుందని... ఇక్కడున్న మౌలిక వసతులు దేశవ్యాప్తంగా ఉన్న స్థిరాస్తి వ్యాపార సంస్థలను ఆకర్షిస్తున్నాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.
mla sudheer reddy:గూగీ ప్రాపర్టీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
గూగీ ప్రాపర్టీస్(googee properties) హైదరాబాద్‌లోని తన నాలుగో శాఖ కార్యాలయాన్ని బీఎన్‌రెడ్డి నగర్లో ప్రారంభించింది. నూతన కార్యాలయాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణలో రియల్ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వవస్థీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న జిల్లాలుగా ఉండడం పాలనావ్యవస్థ అందుబాటులో ఉండడం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపార రంగం అభివృద్ధి చెందుతోంది. దేశంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడున్న మౌలిక సౌకర్యాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. -సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే
ఇదీ చూడండి:MINISTER VEMULA: 'రీజనల్ రింగ్ రోడ్డుతో.. స్థిరాస్తి రంగానికి ఆకాశమే హద్దు'