తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది' - తెలంగాణ తాజా వార్తలు

ఓజోన్ పొరను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు మొక్కలను పెంచడమే కాకుండా... అడవులు నరకొద్దని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. విష వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

'ఓజోను పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది'
'ఓజోను పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది'

By

Published : Sep 16, 2020, 2:24 PM IST

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సిగ్ననేచర్ బ్రాండ్ ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ పరిధిలోని సత్యనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓజోను పొరను కావాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి పేర్కొన్నారు.

మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి భారీ మొత్తంలో విషవాయువులు వెలువడడం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాగర్ రెడ్డి, విజయ గౌడ్, తోట మహేష్ యాదవ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సినీనటుడు శివబాలాజీ ఫిర్యాదుపై స్పందించిన హెచ్​ఆర్​సీ

ABOUT THE AUTHOR

...view details