రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రితోపాటు సింగరేణి సీఎండీ తన హక్కులను కాలరాశారని ఆరోపించిన ఆయన... వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేగా తనను పిలవలేదని... ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
అండర్ గ్రౌండ్ మైనింగ్‌ని ఓపెన్ కాస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల, వారసత్వ ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలు ఆర్ అండ్ ఆర్, సింగరేణి ప్రభావిత సమస్యలపై మాట్లాడుతాననే తనను సమావేశానికి పిలవలేదన్నారు. సభాపతి వద్ద న్యాయం జరగనట్లయితే ప్రజల్లోకి వెళతానని చెప్పారు.
మంత్రి కొప్పులపై ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం - singareni
మంత్రి కొప్పుల ఈశ్వర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేనైన తనను పిలవకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
మంత్రి కొప్పులపై ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం