కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో కలిసి ట్యాంక్‌బడ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క నిరసన
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేయాలని... ఇళ్ల వద్దలకు వెళ్లి ఉచిత వ్యాక్సిన్ వేయాలన్నారు. కరోనా మృతులకు ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం, ఉచిత అంబులెన్స్ సేవలని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని, కరోనా మృతులకు ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు నిత్యవసర సరుకులు, రూ.1500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:బాత్రూంలో కరోనా బాధితుడు క్వారంటైన్.. ఏం జరిగిందంటే!