రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లినట్లు ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలు స్పష్టం చేశారు. తమ అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తామన్నారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించేందుకు అవకాశం లేకుండా కరోనా బూచి చూపి వాయిదా వేశారని ఆరోపించారు. మొదట అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన కిసాన్ కాంగ్రెస్...అది వాయిదా పడడం వల్ల ప్రగతిభవన్ ముట్టడికి వెళ్లినట్లు వారు వివరించారు.
'రైతు సమస్యల పరిష్కారానికే ప్రగతిభవన్ ముట్టడికి వెళ్లాం' - pragathi bhavan muttadi
రైతు సమస్యల పరిష్కారం కోసమే ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లినట్లు ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలు తెలిపారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని వారు ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం లేకుండా 8రోజులకే వాయిదా వేశారని విమర్శించారు.
'రైతు సమస్యల పరిష్కారానికే ప్రగతిభవన్ ముట్టడికి వెళ్లాం'
గత నెల 15వ తేదీ నుంచి పడుతున్న వర్షం కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటనష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. పంట నష్ట పరిహారం, గిట్టుబాటు ధర కల్పన, పంటల బీమా లేదని.. వీటన్నింటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదని ఆరోపించారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు