ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన రోజా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
MLA ROJA: భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా - mla roja
ఏపీలోని చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా... తన భర్తతో కలిసి కబడ్డీ ఆడి... క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. గ్రామీణ క్రీడా సంబరాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ సత్తా చాటాలని సూచించారు.
భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
అనంతరం ఆమె భర్త సెల్వమణితో కలిసి.. కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని రోజా సూచించారు. చదువుతో పాటు ఆటల్లోనూ సత్తా చాటాలన్నారు. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో మంచిదని తెలిపారు.
ఇదీచదవండి.Telangana High Court: సమాచార హక్కుపై సీఎస్ కీలక ఉత్తర్వులు.. హైకోర్టు స్టే