నటి, రాజకీయ నాయకురాలిగా రెండు పాత్రల్లోనూ.. రోజా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తోందని గవర్నర్ తమిళిసై కొనియాడారు. హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవ జనార్దన పారిజాతం ఆంధ్ర నాట్య ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు.
అలరించిన రోజా 'ఆంధ్ర నాట్యం' - MLA ROJA CLASSICAL DANCE
హైదరాబాద్ రవీంద్రభారతిలో నవజనార్దన పారిజాతం ఆంధ్ర న్యాట ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, నటి రోజా ప్రదర్శన చేసి ఆహుతులను అలరించారు. ఈ నాట్యానికి ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు.
ఆంధ్ర నాట్యం చేసి అలరించిన ఎమ్మెల్యే రోజా
కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా తన నాట్య ప్రదర్శనతో ఆహుతులను అలరించారు. రోజా, సెల్వమణి దంపతులను గవర్నర్ సన్మానించారు.
ఇదీ చూడండి :15ఏళ్లకు తిరిగొచ్చిన కొడుకు.. ఆకాశాన్నంటిన సంబరం
Last Updated : Mar 8, 2020, 6:38 PM IST