తెలంగాణ

telangana

ETV Bharat / state

విచారణకు హాజరుకాని రోహిత్‌రెడ్డి.. చట్టపరంగా ముందుకు వెళ్లే యోచనలో ఈడీ - రోహిత్‌రెడ్డి వ్యాఖ్యలు

MLA Rohit Reddy did not attend the ED investigation: ఈడీ కేసులకు తాను భయపడనని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఈడీ పరిధిలోకి రాని అంశాన్ని సైతం కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

rohit
విచారణకు హాజరుకాని రోహిత్‌రెడ్డి

By

Published : Dec 27, 2022, 7:32 PM IST

Updated : Dec 27, 2022, 10:40 PM IST

MLA Rohit Reddy did not attend the ED investigation: ఈడీ కేసు విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరుకాలేదు. మంగళవారం తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో సోమవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ కేసును పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. ఈనెల 15న పీఎంఎల్‌ఏ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాగంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ 48/2022 నమోదు చేసి రోహిత్‌రెడ్డిని రెండు రోజుల పాటు ప్రశ్నించారు.

ఇదే కేసులో అభిషేక్‌ అనే గుట్కా వ్యాపారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. వీరిద్దరితో పాటు నందకుమార్‌ను కూడా ఈడీ అధికారులు చంచల్‌గూడ జైల్లో ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీలాండరింగ్ లేకుండానే ఈడీ అక్రమంగా తనపై కేసు నమోదు చేసిందని రోహిత్‌రెడ్డి సోమవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

దీనికి సంబంధించి రోహిత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో మీడియా ముఖంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈడీ పరిధి దాటి విచారణ జరుపుతోందని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధిస్తున్నారని కూడా రోహిత్‌రెడ్డి బాహటంగానే చెప్పారు. అయితే, హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌లో ఈడీ అధికారులు నమోదు చేసిన ఈసీఐఆర్‌ 48/2022ను పూర్తిగా రద్దు చేయాలని, ఎక్కడా మనీలాండరింగ్‌ జరగకుండానే ఈడీ దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు.

''ఈడీ ఎదుట హాజరయ్యే విషయం న్యాయవాదులతో చర్చిస్తా. వారి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటా. ఈడీ పరిధిలోకి రాని అంశాన్నివిచారిస్తున్నారు. కుట్రలో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తున్నారు. రేపు రిట్ పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో న్యాయవాదులతో చర్చించి.. ఆ తర్వాత ఈడీ ఎదుట హాజరుకావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటా. వ్యక్తిగతంగా హాజరుకావాలా.. లేదా తమ ప్రతినిధిని పంపించాలా అనేది న్యాయవాది సూచన మేరకు చేస్తా. అయినా ఇందులో నేరం, మనీల్యాండరింగ్ లేదు. అంతా కుట్ర సాగుతోంది. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ కేసులకు భయపడను. ధైర్యంగా ఎదుర్కొంటా..''- పైలట్ రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే

కేంద్రంతో పాటు ఈడీ, ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. బుధవారం రిట్ పిటీషన్‌పై విచారణ జరగనున్న దృష్ట్యా... న్యాయవాదులతో సంప్రదించిన తర్వాత వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరు కావాలా? వద్దా.. అనేది నిర్ణయం తీసుకుంటానని రోహిత్‌రెడ్డి తెలిపారు. ఈడీ కేసులకు భయపడనని.. ధైర్యంగా ఎదర్కొంటానని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

రోహిత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2022, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details