MLA Rekha Naik Congress Ticket 2023 :కాంగ్రెస్ టికెట్ కోసం ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండికాంగ్రెస్ టికెట్‌కోసం రేఖా నాయక్ దరఖాస్తు చేయడంతో ఈ విషయం కాస్త రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు గాంధీభవన్‌లో దరఖాస్తును రేఖా నాయక్ పీఏ అందజేశారు. అలాగే ఆసిఫాబాద్ టికెట్ కోసం రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
MLA Rekha Naik Applies For Congress Ticket :నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్(Khanapur BRS MLA Rekha Naik) ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్ హస్తం కండువా కప్పుకున్నారు. సోమవారం రోజున సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తనకు చోటు దక్కకపోవటంపై నిరాశకు గురైన రేఖా నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పార్టీ మారాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఎవరు మోసం చేసినా.. నియోజకవర్గం ప్రజలంతా తన వెంటనే ఉన్నారని ఆమె తెలిపారు. అయితే ఆమె పార్టీ మారకముందే.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Telangana Congress MLA Candidates List : సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా
Telangana BRS MLA Candidates List 2023 : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా బీఆర్ఎస్ సిట్టింగ్‌లు అందరికీ టికెట్లు లభించగా.. అవకాశం దక్కని వారిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్ బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమయ్యారు. రేఖా నాయక్ స్థానంలో జాన్సన్ రాఠోడ్ నాయక్‌కు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలోని అనుచరులు రేఖా నాయక్ కార్యాలయానికి చేరుకున్నారు. టికెట్ దక్కకపోవటంతో కార్యకర్తల వద్ద ఆమె కన్నీరు పెట్టుకున్నారు.