Threatening calls to MLA Raja singh: బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ హిందూత్వ వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఇప్పుడు వార్తల్లో ఉండే రాజాసింగ్.. తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
అసలు జరగిన విషయం ఇది...హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ట్విటర్ వేదికగా... తనకుబెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ ట్వీట్ చేశారు. సాయంత్రం 3:34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చిందని రాజాసింగ్ పేర్కొన్నాడు. తనను చంపుతానని ఓ పాకిస్థానీ వాట్సాప్ కాల్‌లో బెదిరించినట్లు వెల్లడించారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయని బెదిరించినట్లు ట్వీట్ చేశారు. ప్రతిరోజూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న రాజాసింగ్... ఈ విషయాన్ని కేంద్రహోం మంత్రి, డీజీపీ, సీపీలకు ట్వీట్ చేశారు.