తెలంగాణ

telangana

ETV Bharat / state

Mla Rajasingh: రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే రాజాసింగ్​.. కారణమేంటంటే.!

హైదరాబాద్​లోని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారికి దళితబంధులాంటి ప్యాకేజీ ప్రకటిస్తే... రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో గెలిచేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని రాజాసింగ్​ ఆరోపించారు. తాము సైతం రాజీనామా చేస్తే నిధులు వస్తాయంటూ... సామాజిక మాధ్యమాల్లో ప్రజలు కోరుతున్నారని తెలిపారు.

Mla Rajasingh
ఎమ్మెల్యే రాజాసింగ్​

By

Published : Aug 2, 2021, 3:58 PM IST

Updated : Aug 2, 2021, 4:24 PM IST

గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులిస్తే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. గోషామహల్‌ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని కేసీర్‌కు సవాల్ విసిరారు.

రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే రాజాసింగ్

సీఎం కేసీఆర్​ గారూ.. నా నియోజకవర్గ ప్రజలంతా నన్ను ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయమంటున్నారు. అలా చేస్తే గోషామహల్​కు వేల కోట్ల నిధులు వస్తాయి. అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. మీరు మా నియోజకవర్గానికి నిధులివ్వండి. దళిత బంధు ఇలాగే ఇక్కడ కూడా ఓ పథకం అమలు చేయండి. మరుక్షణమే నేను రాజీనామా చేస్తా. - రాజాసింగ్​, గోషామహల్ ఎమ్మెల్యే

తనను రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని స్పష్టం చేశారు. గోషామహల్​లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు సైతం రూ. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులన్నీ ఎంఐఎం కోసమే ఖర్చు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్‌కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తుందని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:CM KCR Speech: 'సాగర్​కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'

Last Updated : Aug 2, 2021, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details