కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తన నియోజకవర్గం గోషామాల్లో నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రతిరోజూ 1000 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నట్లు చెప్పారు.
'పేదలు అలమటిస్తున్నారు... రేషన్ షాపులు తెరవండి' - ముఖ్యమంత్రి కేసీఆర్
పేదలు ఆకలితో అలమటిస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రేషన్ దుకాణాలు తెరిపించాలని ఆయన సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
MLA Rajasingh latest news
ప్రతివీధి నుంచి వేలమంది ప్రజలు భోజనం కోసం వస్తున్నారని తెలిపారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకొని రేషన్ షాప్లు తెరిపించి... బియ్యం అందేలా చూడాలని కోరారు.