సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... అక్కడ ఒక్కో కానిస్టేబుల్‌ను నియమిస్తే... గోవుల అక్రమ రవాణా జరగదని ఎమ్మెల్యే రాజాసింగ్... సీపీ సజ్జనార్‌ను కోరారు. గోవుల అక్రమ రవాణాపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సీపీ ఖండించారు. బహిరంగంగా పోలీసులను దూషిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా... ఎమ్మెల్యే దీనిపై స్పందించారు.
''సైబరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ముందు నుంచి వధించేందుకు ఆవులు తీసుకెళ్లడం లేదా? దీనికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించండి. గో రక్షకులు లారీలను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కి తీసుకొస్తే.. వారిని దుర్భాషలాడి కేసులు నమోదు చేస్తామని బెదిరించారా లేదా? ఇది కూడా తెలుసుకోండి. మా తప్పు ఉంటే.. నా మీద కేసులు బనాయించిన నేను రెడీ. ఒకవేళ పోలీసులది తప్పని తెలిస్తే ఏంచేస్తారు?''