ముఖ్యమంత్రి కేసీఆర్ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బతికితే ఏంటి? చస్తే ఏంటని కేసీఆర్ భావిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని ఇదివరకే లేఖ రాశానని తెలిపారు. పనిచేయని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే బాగుచేసి మళ్లీ పంపారని ఫైర్ అయ్యారు.
ప్రాణహాని దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్లాలని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇస్తున్నా... కేసీఆర్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని మండిపడ్డారు.
రాజాసింగ్ బతుకితే ఎంది? చస్తే ఏంది? అనే భావనలో కేసిఆర్ ఉన్నారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారు. నాకు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు ఇది వరకే లేఖ రాశా.. అదే వాహనాన్ని బాగు చేసి నాకు తిరిగి పంపించారు. ప్రాణహాని ఉంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగకపోతే నోటీసు ఇస్తున్నారని.. తిరిగితే బండి ఎప్పుడు పాడు అవుతుందో అర్థం కావట్లేదు.- రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
ఇటీవల ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. ‘‘నాకు కేటాయించిన వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ పలుమార్లు పోలీసు శాఖ దృష్టికి తీసుకొచ్చినా తిరిగి అదే వాహనాన్ని కేటాయిస్తున్నారు. 2010 మోడల్‌కు చెందిన వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్గంమధ్యలోనే నిలిచిపోతోంది.