తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా బహిరంగ సభలో రాజాసింగ్ కలకలం.. అసలేమైందంటే? - బండి సంజయ్ వ్యాఖ్యలు

పెద్దఅంబర్‌ పేటలో నిర్వహిస్తున్న భాజపా భారీ బహిరంగ సభలో రాజాసింగ్ కలకలం రేగింది. అదేంటీ అనుకుంటున్నారా... ఆయనపై పీడీ యాక్టు నమోదైంది. జైలులో ఉంటున్నారు.. సభకు రావడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఆ సభలో రాజాసింగ్ కలకలం రావడానికి కారణం ఏంటో కింది స్టోరీ చదివి తెలుసుకోండి.

MLA Rajasingh fans rioted at BJP public meeting
భాజపా భారీ బహిరంగ సభలో రాజాసింగ్ కలకలం.. అసలేమైందంటే?

By

Published : Sep 22, 2022, 7:36 PM IST

బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ప్రారంభమైంది. పెద్దఅంబర్‌పేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భాజపా నేతలతో పాటు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తుగా తరలివచ్చారు. అయితే ఈ సభలో ఎమ్మెల్యే రాజాసింగ్ కలకలం రేగింది. సభలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతుండగా... రాజాసింగ్ అభిమానులు గందరగోళం సృష్టించారు. రాజాసింగ్ ఎక్కడా అంటూ... గట్టిగా అరిచారు. రాజాసింగ్ రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్నా వాళ్లు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. రాజాసింగ్‌కు ఇంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారా అని అనుకున్నారు. ఇంకా గందరగోళం ఎక్కువ అవుతుందని గమనించిన బండి సంజయ్... వాళ్లని సముదాయించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు.

ఇటీవల రాజాసింగ్ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది. ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా... ప్రస్తుతం పీడీ యాక్ట్‌ కింద రాజాసింగ్ జైలులో ఉన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details