ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షానికే ఉస్మానియా ఆసుపత్రి జలమయమైందన్నారు. ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేని స్థితిలో ఉందన్నారు.
'ఆస్పత్రులను సందర్శించి సీఎం సమస్యలను పరిష్కరించాలి' - rajasingh spoke on cm kcr
సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
'సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సమస్యలను పరిష్కరించాలి'
ఇప్పటికైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వర్షం కారణంగా కూలిపోతే తెలంగాణ ప్రజలు కేసీఆర్పై హత్య కేసు పెట్టేలా ఉద్యమాన్ని తీసుకువస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఉస్మానియాలోకి వర్షపు నీరు.. ఆందోళనలో రోగులు, వైద్యులు