మరో జన్మంటూ ఉంటే ముస్లింగా పుడతానంటున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశమేంటో చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇలా మాట్లాడే వారి సంఖ్య తెరాసలో పెరుగుతోందని పేర్కొన్నారు. ఇష్టముంటే మరో జన్మ ఎందుకు... ఈ రోజే మతం మారవచ్చని హితవు పలికారు. రజాకార్ల సమయంలోను హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయన్నారు. హిందూ ధర్మం ఇష్టం లేదా... హిందూ ధర్మం వల్ల మీకేం అన్యాయం జరుగుతుందని తెరాస నేతలను రాజాసింగ్ ప్రశ్నించారు.
మరో జన్మ ఎందుకు ఈరోజే మారండి: రాజాసింగ్
మరో జన్మంటూ ఉంటే ముస్లింగా పుడతానంటున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశమేంటో చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
raja singh
Last Updated : Aug 30, 2019, 12:56 PM IST