ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ఫామ్‌హౌస్‌లో సేదతీరుతోన్న కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే అధికారులతో కనీసం సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. దేవుడిపై భారం వేసి ప్రజలు బతుకుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది: రాజాసింగ్ - mla rajasing latest news
రాష్ట్రప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్స్ లేక ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదంటూ విమర్శించారు.
ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శ్మశాన వాటికల్లో శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంటే.. కేసీఆర్ కనీసం స్పందించడం లేదన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉందో లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా సీఎం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: '120 ఎకరాల్లో తనిఖీ రాత్రికి రాత్రే ఎలా చేశారు..?'