భాజపా శాసనసభ్యుడు చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా చేపట్టే శోభయాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని రాముడుగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రావణాసురుడిగా ఆయన అభివర్ణించారు. రావణాసురుడు ప్రతీ గల్లీలో తిష్టవేశాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మోదీ దేశమంతా తిరుగుతూ రావణాసురున్ని అంతమొందించి దేశ ప్రధాని అవుతారని రాజాసింగ్ అన్నారు. ప్రజలంతా శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
"మోదీ రాముడు.. రాహుల్ రావణాసురుడు" - pm
శ్రీరామనవమి సందర్భంగా చేపట్టే శోభాయాత్ర వివరాలు వెల్లడిస్తూ భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రాముడు కాంగ్రెస్ నేత రాహుల్ రావణాసురుడని అభివర్ణించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు