తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాజపాలో చేరినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను' - congress

తనతో పాటు ఆయన సోదరుడు భాజపాలో చేరుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​ కాలం చెల్లిన మెడిసిన్​ లాంటిదని విమర్శించారు. ​అసెంబ్లీ ప్రాంగణంలో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.

భాజపాలో చేరినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను

By

Published : Jul 19, 2019, 11:45 PM IST

'భాజపాలో చేరినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను'
తన లాంటోడు భాజపాలో చేరితేనే ఆ పార్టీ బలపడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. త్వరలో తన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాషాయం కండువా కప్పుకుంటారని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. భాజపాలో చేరినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కాలం చెల్లిన మెడిసిన్ లాంటిదని విమర్శించారు. కాంగ్రెస్ మునిగే పడవ అని.. టైటానిక్ ఓడలో తనలాంటి హీరో ఉన్నా మునిగిపోవాల్సిందేనని తెలిపారు. పీసీసీ ఇస్తానంటే వద్దన్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ రేసులో ఉన్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details