తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజాసింగ్​ మద్దతుదారుల ఆందోళనలు, వ్యాపారుల దుకాణాలు బంద్ - protest in hyderabad

Rajasingh supporters protest ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్ట్​ను నిరసిస్తూ హైదరాబాద్​లో వ్యాపారులు బంద్​ నిర్వహించారు. నగరంలో పలుచోట్ల రాజాసింగ్ మద్దతుదారులు ఆందోళనలు చేశారు. సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

రాజాసింగ్​ మద్దతుదారుల ఆందోళనలు
రాజాసింగ్​ మద్దతుదారుల ఆందోళనలు

By

Published : Aug 25, 2022, 7:55 PM IST

Rajasingh supporters protest: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్​కు నిరసనగా హైదరాబాద్​లోని బేగంబజార్ మార్కెట్​ వ్యాపారులు బంద్ చేశారు. అతనిపైన అక్రమంగా పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారని ఆందోళనకు దిగారు. నగరంలోని బేగంబజార్, ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్, కిషన్ గంజ్ ప్రాంతాల్లో మార్కెట్లలో దాదాపు 1000 దుకాణాల వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి రాజాసింగ్​కు మద్దతుగా నిలిచారు. బేగంబజార్​లో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్​కు నిరసనగా గోషామహల్ నియోజకవర్గ వర్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎంజే మార్కెట్ కూడలి వద్ద రాజాసింగ్ అభిమానులు సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బషీర్ బాగ్ కమిషనర్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యతిరేక వర్గీయులు నిరసనకు దిగారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజా సింగ్​ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ కార్యాలయం ముందు రోడ్​పై బైఠాయించి సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details