తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి హరీశ్​ రావుకు ఫోన్ చేస్తే స్పందించనేలేదు: రాజా సింగ్ - గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్

MLA Raja Singh Stopped The Initiation of Doctor: గత మూడు రోజులుగా హైదరాబాద్​లో నిరసన చేస్తున్న ప్రభుత్వ వైద్యుడు వసంత్​ దీక్షను విరమించారు. దీక్ష చేస్తున్న సంఘటన స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్.. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. డా. వసంత్ అంశం మాట్లాడేందుకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావుకు ఫోన్ చేస్తే అతను స్పందించలేదని రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు వసంత్ అంశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించినట్లు, ఆయన హైదరాబాద్ రాగానే వసంత్​ను కలిసి మాట్లాడతానని హామీనిచ్చారని అన్నారు.

Goshamahal MLA Raja Singh
Goshamahal MLA Raja Singh

By

Published : Dec 7, 2022, 5:51 PM IST

MLA Raja Singh Stopped The Initiation of Doctor: హైదరాబాద్​లో దీక్ష చేపట్టిన ప్రభుత్వ వైద్యుడు వసంత్ ఆందోళన విరమించాలని, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. సుల్తాన్ బజార్​లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత మూడు రోజులుగా డాక్టర్ పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకొని నిరసన చేపట్టారు. డాక్టర్ వసంత్ సుల్తాన్ బజార్ యూపీహెచ్​సీలో మెడికల్ ఆఫీసర్​గా పనిచేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో తాను కరోనాకు మందు కనిపెట్టానని డాక్టర్ వసంత్ చెబుతున్నారు. దీని గురించి ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోవట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. h

ప్రభుత్వ తీరును నిరసిస్తూ వసంత్ తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోనే పెట్రోల్ బాటిల్​తో ఆందోళనకు దిగారు. పోలీసులు లోనికి వస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయనకు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే హామీతో ఆయన డోర్ తెరిచారు. తాను కేవలం 45 రూపాయలకే ఐదు రోజుల్లో కోవిడ్​ను పూర్తిగా నయం చేస్తానని చెబుతున్నా.. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతస్థాయిలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

అనంతరం డా. వసంత్ అంశం మాట్లాడేందుకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావుకు ఫోన్ చేస్తే స్పందించలేదని రాజాసింగ్ తెలిపారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహించిన వైద్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు తగదన్నారు. వసంత్ అంశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించినట్లు, ఆయన హైదరాబాద్ రాగానే కలిసి మాట్లాడతానని హామీనిచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వసంత్ రీసెర్చ్​ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే హామీతో దీక్ష విరమించినట్లు, తమ చికిత్సపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని.. అప్పటి వరకు తమ పోరాటాన్ని కొనసాగుతోందని డా. వసంత్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details