2018లో స్వామి పరిపూర్ణానంద ర్యాలీలో పాల్గొన్న సమయంలో కేసు నమోదైందంటూ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ఈ రోజు నోటీస్ ఇచ్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఒక్కొక్కటిగా కేసులు నమోదు చేయడం బదులు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టదల్చుకున్నారో ఒకేసారి పెట్టాలని ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
'నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర' - telangana varthalu
కేసులు పెట్టి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టదల్చుకున్నారో ఒకేసారి పెట్టాలని సీఎం, హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
'రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు'
తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారని.. అయినప్పటికీ భయపడనని తెలిపారు. లక్షల కేసులు నమోదు చేసినప్పటికీ దేశం, ధర్మం కోసం మరింత ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రైతులను నష్టపరిచే చట్టాలపై చట్టసభల్లో నిలదీస్తాం: భట్టి