తెలంగాణ పోలీసులను చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. యావత్ భారతావని పోలీసుల వెంటే ఉందని స్పష్టం చేశారు.
'అప్పుడు తిట్టిన నేనే ... ఇప్పుడు పొగుడుతున్నా' - mla raja singh
హత్యాచారం చేసే నిందితులకు ఎన్‌కౌంటరే సరైన సమాధానమని ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. దిశ కేసులో నిందితులను హత్య చేసిన తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు.

తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ : ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ : ఎమ్మెల్యే రాజాసింగ్
హత్యాచారం చేసే నిందితులకు ఈ విధంగానే శిక్ష వేయాలని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ పోలీసులను ఎంతో మంది తిట్టారని, అందులో తాను ఒకర్నని తెలిపారు. కానీ.. దిశ హత్యాచారం కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడమే గాక.. నిందితులను కఠినంగా శిక్షించారని హర్షం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : తెలంగాణ పోలీస్‌కు జై : విద్యార్థినులు