తెలంగాణ

telangana

ETV Bharat / state

'సభ్యుల సంఖ్య కాదు.. ప్రతిపక్షాన్ని బతకనివ్వండి' - Dubbaka MLA Raghunandan Rao

ప్రభుత్వంపై భాజపా ఒత్తిడి, నిరసనలు చేయడంతోనే ఉద్యోగులకు కేసీఆర్​ పీఆర్సీని ప్రకటించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల దృష్ట్యా ఇష్టం లేకున్నా.. కష్టం కొద్ది పీఆర్సీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను కూడా బతకనివ్వాలని కోరారు. తెలంగాణలో ప్రతి ఒక్కరీ మీద ఎంత అప్పు ఉందో చెప్పాలని నిలదీశారు.

mla-raghunandan-rao-said-tell-everyone-how-much-debt-in-telangana
'సభ్యుల సంఖ్య కాదు.. ప్రతిపక్షాన్ని బతకనివ్వండి'

By

Published : Mar 22, 2021, 6:37 PM IST

Updated : Mar 22, 2021, 6:59 PM IST

'సభ్యుల సంఖ్య కాదు.. ప్రతిపక్షాన్ని బతకనివ్వండి'

భాజపా భయంతోనే ఉపాధ్యాయ, ఉద్యోగులను మంచి చేసుకునే పనిలో భాగంగానే కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. నాణానికి బొమ్మతో పాటు.. బొరుసు కూడా ఉంటుందని స్పీకర్, మంత్రులు హరీశ్​​, ప్రశాంత్ రెడ్డిలు గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు తప్పనిసరి పరిస్థితుల్లోనే సీఎం చిత్రపటానికి పాలభిషేకాలు చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథలో తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ను నియమించి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

శాసనసభలో కేంద్రంపై మంత్రి హరీశ్​ రావు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ఆర్థికమంత్రికి జ్ఞానోదయం చేసేవాడినన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించక పోవటం వల్లనే ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యం అయిందని చెప్పారు. ఐటీఐఆర్, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై మంత్రి హరీశ్​ రావు నిండు సభలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఎఫ్​ఆర్​బీఎం పరిధిని పెంచి అప్పులు తెచ్చుకునే అవకాశం కేంద్రం ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మీద ఎంత అప్పు ఉందో హరీశ్​ రావు సభలో చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి :'భాజపా ఒత్తిడి వల్లే ప్రభుత్వం పీఆర్సీ'

Last Updated : Mar 22, 2021, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details