రెండు రోజుల వానలకే హైదరాబాద్ అతలాకుతలమవుతోందని.. అసెంబ్లీని వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని(raghunandan rao fires on trs) దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. ఐటీ, పరిశ్రమల రంగంపై అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చ అనంతరం మంత్రి కేటీఆర్ సమాధానంపై భాజపా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మంత్రి సమాధానం తర్వాత తమ అభ్యంతరాలను వెలిబుచ్చేందుకు స్పీకర్ నిరాకరించారనీ... వెంటనే సభను వాయిదా వేశారని రఘునందన్ రావు విమర్శించారు. తెరాస ప్రభుత్వం రాకముందు నుంచే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయనీ... టీకాలు తయారు చేసే సంస్థలు ఒక్కటి కూడా ఈ ఏడేళ్లలో రాలేదని తెలిపారు.
ఒక్క రూపాయి ఇవ్వలేదు..
హైదరాబాద్‌ను అంకురాల కేంద్రంగా చెబుతున్నారని... సిరిసిల్ల, మెదక్ నుంచి వచ్చి ఒక్కరైనా అంకురం పెట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలు ఎందుకు తెరిపించట్లేదని నిలదీశారు. రైతు పంట కొనేందుకు గోదాములు, గోనెసంచులు లేవని పేర్కొన్నారు. వ్యాక్సిన్(corona vaccine) తయారీకి రాష్ట్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? అని రఘునందన్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని(cm kcr family) విమర్శిస్తే రాష్ట్రాన్ని విమర్శించినట్లు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో(telangana movement) తాము మొదటి నుంచి ఉన్నామని.. కేటీఆరే(raghunandan rao fires on minister ktr) చాలా ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు.
ఎన్ని లక్షల ఆర్డర్లు ఇచ్చారు?
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ ప్రజలు భోజనం చేస్తున్నారని... పోలియో టీకాలు వేసుకుంటున్నారనేలా తెరాస వ్యవహరిస్తోందన్నారు. రెయాన్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్, అజాంజాహి మిల్, ప్రాగా టూల్స్, ఆల్విన్ కంపెనీల సంగతి ఏంటని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. బతుకమ్మ చీరల కోసం సిరిసిల్ల, దుబ్బాకకు ఎన్ని లక్షల ఆర్డర్లు ఇచ్చారని ప్రశ్నించారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి... ఇక్కడ పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు.