ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన సుబ్బయ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రాచమల్లు దైవ సన్నిదిలో ప్రమాణం చేయడంపై మృతుడి భార్య స్పందించారు. తన భర్తను.. ఎమ్మెల్యే, అతని బావమరిదే చంపించారని పునరుద్ఘాటించారు.
'నా భర్తను చంపి.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే నీచంగా మాట్లాడుతున్నారు' - mla rachamallu siva prasad reddy news
తన భర్తను చంపేసి, ఇప్పుడు మళ్లీ అతని గురించి నీచంగా మాట్లాడుతున్నారంటూ.. ఏపీలోని కడప జిల్లా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై మృతుడు సుబ్బయ్య భార్య మండిపడ్డారు. వాస్తవం మాట్లడినందుకే తన భర్తను చంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'చనిపోయాకా కూడా నా భర్తను వదలరా..?'
మృతుడిపై ఎమ్మెల్యే ఆరోపణలు చేయటాన్ని సుబ్బయ్య భార్య ఖండించారు. చనిపోయిన వ్యక్తి గురించి నీచంగా ఎలా మాట్లాడుతారంటూ మండిపడ్డారు. వాస్తవం మాట్లడినందుకే తన భర్తను చంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:సుబ్బయ్య హత్య కేసు: ఎమ్మెల్యే సహా మరో ఇద్దరిపై కేసు నమోదు