తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల - ఏపీ తాజా వార్తలు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయింది. ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా.. నామినేషన్ల దాఖలుకు మార్చి 4 తుదిగడువు విధించింది. మార్చి 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగనుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

By

Published : Feb 18, 2021, 2:51 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఇటీవల ఖాళీఅయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనుండగా.. నామినేషన్ల దాఖలుకు మార్చి 4 వరకు గడువు విధించింది. మార్చి 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. మార్చి 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.

తెలుగుదేశం నేతలు తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వీరవెంకన్న చౌదరితోపాటు వైకాపా నేత మహ్మద్ ఇక్బాల్ పదవీ కాలం పూర్తవటంతో నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక వైకాపా నేత పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైకాపా నేత చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో చనిపోయారు. మొత్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

ఇదీ చదవండి:జడ్పీ ఛైర్మన్ పుట్టమధుపై అనుమానం : కిషన్ రావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details