ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తైంది. రెండు నామినేషన్లు దాఖలు కాగా...అందులో ఒకటి తిరస్కరణకు గురైంది. ఇక ఈ ఉపఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెరాస అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ ఆమోదం పొందగా...ఎమ్మెల్యేల ప్రతిపాదనలు లేనందున శ్రమజీవి పార్టీ అభ్యర్థి భోజ్రాజ్ కోయల్కర్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నెల19న ఉపసంహరణ గడువు ముగియనుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే పోటీలో ఉండటం వల్ల... ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆగస్టు 19న సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు.
ఎమ్మెల్సీగా గుత్తా ఎన్నిక లాంఛనమే..! - ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తైంది. తెరాస అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ ఆమోదం పొందగా... శ్రమజీవి పార్టీ అభ్యర్థి భోజ్రాజ్ కోయల్కర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.
MLC