తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూ బకాసురుల నుంచి రక్షించండి' - ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భూఅరచకాలు

ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్‌, ఎంపీటీసీ సిద్దేశ్వర్‌, సర్పంచ్‌ ఇస్తారీలు తమ భూమిని అక్రమించుకోవడమే కాకుండా...  తమను భయాందోళనకు గురిచేస్తున్నారని బాధితుడు సంతోష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'భూ బకాసురులు నుంచి రక్షించండి'

By

Published : Nov 20, 2019, 11:32 PM IST

తమ భూమిని ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్‌, ఎంపీటీసీ సిద్దేశ్వర్‌, సర్పంచ్‌ ఇస్తారీలు అక్రమించుకోవడమే కాకుండా... భయాందోళనకు గురిచేస్తున్నారని బాధితుడు సంతోష్‌రెడ్డి ఆరోపించారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ను కలిస్తే... వేరే ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారని పేర్కొన్నారు. శంషాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇప్పటికీ రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. చట్టబద్ధంగా తాము కొనుగోలు చేసిన స్థలంలోకి తమను రాకుండా అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవటంతో పాటు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'భూ బకాసురులు నుంచి రక్షించండి'

ABOUT THE AUTHOR

...view details