హైదరాబాద్ అడ్డగుట్టలో 2.25 కోట్లతో నూతనంగా నిర్మించబోయే జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ ప్రతిపాదనలను సికింద్రాబాద్ టకరబస్తీలోని తన నివాసంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆమోదించారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఫంక్షన్‌హాల్ నిర్మాణ ప్రతిపాదనలకు పద్మారావుగౌడ్ ఆమోదం - corona virus
హైదరాబాద్ అడ్డగుట్టలో నిర్మించబోయే జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ ప్రతిపాదనలను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆమోదించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఫంక్షన్‌హాల్ నిర్మాణ ప్రతిపాదనలకు పద్మారావుగౌడ్ ఆమోదం
అలాగే సీతాఫల్మండి డివిజన్లో కరోనా కేసులు అధికంగా ఉన్నందున అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, రాపిడ్ టెస్ట్ కిట్లు పెంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెస్టులు చేయాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ కుమారి సామల హేమ పాల్గొన్నారు.