ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇసుక ధరల పెంపుపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తోపుడు బండిపై ఇసుక ప్యాకెట్లు పేర్చుకొని రోడ్డుపై ప్రదర్శన నిర్వహించారు. ఇసుక ధర బంగారంతో సమానంగా ఉందంటూ తక్కెడలో ఓ పక్క ఇసుక, మరో పక్క బంగారాన్ని ఉంచి తూచారు.
అక్కడ ఇసుక-బంగారం రెండూ ఒకటేనట..! - ఇసుకను తులాల లెక్కన అమ్ముతున్న ఎమ్మెల్యే!
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ధర బంగారం ధర ఒకటే అంటూ ... పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తక్కెడ ఇసుకను, బంగారాన్ని తూచి, రాష్ట్రంలో రెండింటి ధర ఒకటే అని ధ్వజమెత్తారు.
ఇసుకను తులాల లెక్కన అమ్ముతున్న ఎమ్మెల్యే!
ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ... స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి:'ఇరు దేశాలు ఎదగడానికి ఇదే సరైన సమయం'