మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను మైనంపల్లి ట్రస్ట్ సభ్యులు బన్సీలాల్ పేట్‌లోని అనాధ శరణాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన హనుమంతరావు గొప్ప నాయకుడిగా ఎదగాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు.
అనాథ శరణాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు న్యూస్
మైనంపల్లి హనుమంతరావు గొప్ప నాయకుడిగా ఎదగాలని ఎమ్మెల్సీ దయాకర్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. బన్సీలాల్ పేట్‌లోని అనాధ శరణాలయంలో నిర్వహించిన హనుమంతరావు జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
![అనాథ శరణాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు mla mynampally hanumantha rao birthday celebration in orphanage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10188873-164-10188873-1610272349154.jpg)
అనాథ శరణాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే హనుమంతరావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దయాకర్ రావు అనాధ బాలికతో కేక్ కట్ చేయించి వారికి అన్నదానం చేశారు. శరణాలయంలో ఉన్న పిల్లలకు వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. నిత్యం సామాన్య ప్రజానికానికి సేవ చేస్తున్న హనుమంతరావు ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు