అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగాసికింద్రాబాద్ అల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్లో పేద ప్రజలకు మైనంపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ 500 మంది పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మైనంపల్లి - groceries distribution
సికింద్రాబాద్ అల్వాల్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడని ఆయన అన్నారు.
![పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మైనంపల్లి mla mynampalli hanumantha rao groceries distribution in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7445703-173-7445703-1591097829702.jpg)
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామని హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచే క్రమంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రాజెక్టులను ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 70 రోజుల నుంచి లక్షలాది మందికి ఆహార ప్యాకెట్లను, నిత్యావసర సరుకులను అందజేసి వారి ఆకలి తీర్చామని అన్నారు.
ఇవీ చూడండి: 'కాంగ్రెస్ జలదీక్షకు మరో రోజు దొరకలేదా?'