తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - hyderabad corna news

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్న ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్​ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు, ఆశ వర్కర్లకు తెరాస యువజన నేత ఎం జైసింహతో కలిసి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.

MLA mutha Gopal was distributes essential commodities
ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 9, 2020, 6:29 AM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ డివిజన్ వెస్ట్ ఎంసీహెచ్ కాలనీ పార్సీగుట్టలో తెరాస సీనియర్ నాయకుడు సోమసుందరం ఆధ్వర్యంలో జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రంలో శాసనసభ్యుడు ముఠా గోపాల్, తెరాస యువజన నేత ఎం జైసింహ పాల్గొని కార్మికులకు సరకులు అందించారు.

లాక్​డౌన్ ముగిసేవరకు ఇదే విధంగా కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కొనసాగాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్​ ఆశాభావం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు.

ఇదీ చూడండి :'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'

ABOUT THE AUTHOR

...view details